Homeఆంధ్రప్రదేశ్పోలవరంప్రశాంతంగా ముగిసిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు

ప్రశాంతంగా ముగిసిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు

 

రెండో విడత ఎన్నికలకూ ప్రజలు సహకరించాలి: జిల్లా ఎస్పీ కే. చక్రవర్తి

రంపచోడవరం (పోలవరం జిల్లా బ్యూరో) పెన్ పవర్, నవంబర్ 26: పోలవరం జిల్లాలో ఐదు మండలాల్లో గురువారం నిర్వహించిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో ముగిశాయని జిల్లా ఎస్పీ కే. చక్రవర్తి ఐపీఎస్ తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ప్రజలు, ఓటర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించి తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకున్నారని పేర్కొన్నారు.

ఎన్నికల సందర్భంగా పోలీసులకు ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించారని ఎస్పీ తెలిపారు. పోలింగ్ అనంతరం నిర్వహించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ సైతం ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రశాంతంగా కొనసాగిందన్నారు. అభ్యర్థులు, వారి మద్దతుదారులు సంయమనం పాటిస్తూ ఎన్నికల ప్రక్రియకు సహకరించారని పేర్కొన్నారు.

ఎన్నికల విధుల్లో పాల్గొన్న పోలీసు అధికారులు, సిబ్బంది పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి, వారికి అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడంతో తొలి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని ఎస్పీ అభినందించారు.

ఇదే స్ఫూర్తితో నవంబర్ 29న నిర్వహించనున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను కూడా ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రజలు, రాజకీయ నాయకులు, అభ్యర్థులు, పోలీసు సిబ్బంది సహకరించాలని జిల్లా ఎస్పీ కే. చక్రవర్తి కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular