గంగవరం/ రంపచోడవరం, పెన్ పవర్ నవంబర్ 27:* రంపచోడవరం మండలంలో గురువారం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 19 పంచాయతీలకు సర్పంచులు ఎన్నికయ్యారు. ఫలితాల్లో వైకాపా 9 స్థానాలు గెలుచుకుని ఆధిక్యంలో నిలిచింది. తెదేపాకు 5, భాజపాకు 2, జనసేనకు 1, స్వతంత్ర అభ్యర్థికి 1, తెదేపా రెబల్ కు 1 స్థానం దక్కాయి.
రంపచోడవరం పంచాయతీ నుంచి వైకాపా మద్దతుతో వేబీకుమారి, అకూరు నుంచి కొండా అబ్బాయిరెడ్డి, బోలగొండ నుంచి రుక్మిణి సాండ్రు, బి.వెలమలకోట నుంచి మడకం రాజు, చొక్కుపేట నుంచి వండ నాగన్నదొర, మురివాడ నుంచి తుమ్మెల ఝాన్సీలక్ష్మీబాయి, ముసురుమిల్లి నుంచి కారం విజయలక్ష్మి, దొట్ట నుంచి చవళం బాపనమ్మ, వేములకొండ నుంచి సాండ్రు రామాయమ్మ విజయం సాధించారు.
బండపల్లి నుంచి తెదేపా మద్దతుతో దుర్గారావు, ఐ.పోలవరం నుంచి కుంజం రామకృష్ణదొర, మడిచర్ల నుంచి వలల అబ్బులు, తామురపల్లి నుంచి కొంచెం బాపనమ్మ, తాటివాడ నుంచి మిరియాల రామారావు గెలుపొందారు.
బీరంపల్లి నుంచి భాజపా మద్దతుతో వి.పద్మ, వాడపల్లి నుంచి వలల బుల్లయ్య విజయం సాధించారు. భూసిగూడెం నుంచి జనసేన మద్దతుతో కత్తుల మంగిరెడ్డి, పెదగెడ్డ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ప్రతీ గంగాభవాని, రంప నుంచి తెదేపా రెబల్ గా వినోద్ బాబు జర్ర సర్పంచులుగా ఎన్నికయ్యారు.
ఎన్నికలు ప్రశాంతంగా ముగియగా, గెలుపొందిన సర్పంచులకు ఆయా పార్టీల నాయకులు, గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు.
