Homeఆంధ్రప్రదేశ్బాపట్లఒకటో వార్డులో సయ్యద్ జోయాకు వెల్లువెత్తిన ప్రజాదరణ

ఒకటో వార్డులో సయ్యద్ జోయాకు వెల్లువెత్తిన ప్రజాదరణ

కుటుంబ సభ్యులతో కలిసి ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించిన తస్లీమ్

వేటపాలెం, నవంబర్ 24 :

వేటపాలెం గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఒకటో వార్డులో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. సర్పంచ్ అభ్యర్థిని సయ్యద్ జోయాకు మద్దతుగా ఆమె భర్త తస్లీమ్, కుటుంబ సభ్యులు మంగళవారం వార్డులో విస్తృతంగా పర్యటిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రతి ఇంటికీ వెళ్లి స్థానిక ఓటర్లను కలుసుకుంటూ సయ్యద్ జోయాకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. వార్డులో నెలకొన్న సమస్యలను గుర్తించి, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రచార సమయంలో పలువురు స్థానికులు అభ్యర్థికి తమ మద్దతు తెలియజేయడంతో ప్రచార బృందంలో ఉత్సాహం నెలకొంది. విజయం సాధించడమే లక్ష్యంగా తస్లీమ్‌తో పాటు కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular