చీరాల, నవంబర్ 12 : నా విజయానికి సహకరించిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ముఖ్యంగా 10వ వార్డు ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాపై నమ్మకంతో ఆదరించి, ఈ విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాను.
ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ 10వ వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. వార్డు ప్రజల సమస్యలను నా సమస్యలుగా భావించి, వాటి పరిష్కారానికి శక్తివంచన లేకుండా పనిచేస్తాను.
ఈ విజయానికి సంపూర్ణ సహకారం అందించిన చీరాల నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు బీఫామ్ అందించి, నాపై నమ్మకం ఉంచి, నా విజయానికి అండగా నిలిచినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఈ గెలుపు నాది మాత్రమే కాదు.. నన్ను నమ్మి ఆదరించిన 10వ వార్డు ప్రజలందరిదీ. మీ నమ్మకమే నా బాధ్యత.. మీ అభివృద్ధే నా లక్ష్యం.

