గూడూరి ఎరిక్షన్ బాబు
పుల్లల చెరువు పెన్ పవర్ మే 1
పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం పుల్లలచెరువు మండలం నాయుడుపాలెం గ్రామంలో పెద్దింటి వెంగయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి యర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు ముఖ్య అతిథిగా హాజరై వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు స్వయంగా పింఛన్లు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల అభ్యున్నతే తమ పార్టీ ప్రధాన ధ్యేయమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు చేరేలా కృషి చేస్తామని తెలిపారు.వృద్ధులకు ఆర్థిక భరోసా కల్పించే ఈ పింఛన్ పథకం వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని అన్నారు.అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పిడికిటివానిపల్లె గ్రామంలో ఐదు లక్షల రూపాయల వ్యయంతో మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అలాగే నాయుడుపాలెం గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఏడు లక్షల యాభై వేల రూపాయల వ్యయంతో మూడు డీప్ బోర్లు తవ్వించినట్లు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని, ప్రజల అవసరాల వెంగయ్య,శనగ వెంకటేశ్వరరెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి తదితర కూటమి నాయకులు, గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

