Homeఆంధ్రప్రదేశ్గిరిజన విద్యార్థులను వెనక్కి పంపొద్దు: ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు

గిరిజన విద్యార్థులను వెనక్కి పంపొద్దు: ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు

విశాఖపట్నం మారికవలస గిరిజన గురుకుల పాఠశాలలో 5, 6, 7 తరగతుల గిరిజన విద్యార్థులను వెనక్కి పంపే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ అల్లూరి జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వర రాజు డిమాండ్ చేశారు. విద్యార్థులకు అన్యాయం జరిగితే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేయగా, అనంతరం ఐటీడీఏ ఏపీఓకు కూడా వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం విద్యార్థులను యథావిధిగా మారికవలస గురుకుల పాఠశాలలోనే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శెట్టి పాల్గుణ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular