ePaper
Friday, May 8, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజువ్యవసాయ యంత్రాలకు దరఖాస్తులు ఆహ్వానం

వ్యవసాయ యంత్రాలకు దరఖాస్తులు ఆహ్వానం

📰 Generate e-Paper Clip

గూడెం కొత్తవీధి,పెన్ పవర్,మే 9:గూడెం కొత్తవీధి మండల రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాల కొనుగోలుకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి డి. గిరిబాబు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ SMAM పథకం కింద చిన్న, సన్నకారు, మహిళా రైతులకు 50 శాతం సబ్సిడీ, ఇతర రైతులకు 40 శాతం సబ్సిడీపై వివిధ యంత్ర పరికరాలను అందించనున్నట్లు పేర్కొన్నారు.మండలానికి మొత్తం రూ.19.83 లక్షలు కేటాయించినట్లు వెల్లడించారు. ప్లాంట్ ప్రొటెక్షన్ పరికరాలు, పోస్ట్ హార్వెస్ట్ & వ్యాల్యూ అడిషన్ యంత్రాలు, పవర్ టిల్లర్లు, రెసిడ్యూ మేనేజ్‌మెంట్/హే & ఫొరేజ్ పరికరాలు, సెల్ఫ్ ప్రొపెల్డ్ ఇంప్లిమెంట్స్, ట్రాక్టర్ డ్రాన్ ఇంప్లిమెంట్స్, 40 హెచ్‌పీ లోపు ట్రాక్టర్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. రైతులు https://essed.ap.gov.in/FM/ పోర్టల్ ద్వారా ఈ నెల 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు సంబంధిత వ్యవసాయ, ఉద్యాన సహాయ అధికారులు లేదా మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular