Homeఆంధ్రప్రదేశ్ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి

ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి

📰 Generate e-Paper Clip

చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మే 10 :

చిలకలూరిపేట: ఆర్టీసీ డ్రైవర్‌పై కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటన,  చిలకలూరిపేట డిపోకు చెందిన డ్రైవర్ గంటూరు నుంచి సుమారు 70 మంది ప్రయాణికులతో బస్సును తీసుకుని బయలుదేరారు. మార్గమధ్యంలో చౌడవరం వద్ద ప్రయాణికులు దిగాల్సి ఉండగా, అక్కడ వర్షం కురుస్తుండటంతో ప్రయాణికుల సౌకర్యార్థం బస్సును కొంచెం ముందుకు తీసుకెళ్లి ఆపేందుకు డ్రైవర్ ప్రయత్నించారు.

ఈ క్రమంలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా బస్సుకు అడ్డంగా రావడంతో కండక్టర్ మరియు డ్రైవర్ అతడితో మాట్లాడారు. అయితే, బస్సు ఎందుకు ఆపలేదని ఆగ్రహించిన సదరు వ్యక్తి, తన అనుచరులతో కలిసి డ్రైవర్‌పై దాడికి దిగాడు. దాదాపు 10 మందికి పైగా వ్యక్తులు డ్రైవర్‌ను, కండక్టర్‌ను అసభ్య పదజాలంతో దూషిస్తూ విచక్షణారహితంగా కొట్టారని

ఈ దాడిలో డ్రైవర్ తీవ్ర అస్వస్థతకు గురై, బీపీ పడిపోవడంతో స్పృహ కోల్పోయారు. వెంటనే సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది బాధితుడిని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన వ్యక్తులు కండక్టర్ ఫోన్‌లోని వీడియోలను బలవంతంగా డిలీట్ చేయించడమే కాకుండా, డ్రైవర్ లైసెన్స్ జిరాక్స్ తీసుకుని బెదిరింపులకు పాల్పడినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular