Homeఆంధ్రప్రదేశ్పోలవరంనిండు గర్భిణీ ఆత్మహత్య

నిండు గర్భిణీ ఆత్మహత్య

భర్త వేధింపులు తాళలేక ఉరివేసుకున్న మహిళ.

భర్త అరెస్టుకు బంధువుల డిమాండ్

చింతూరు పన్ పవర్ మే 17:

కూనవరం మండలం టేకులబోరు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో నిండు గర్భిణీ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. సంధ్య (28) గత కొద్ది రోజులుగా భర్త బొడ్డు అఖిల్ వేధింపులు తాళలేక తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం ఆమె ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు ఎనిమిది నెలల గర్భిణీ కావడం మరింత విషాదాన్ని మిగిల్చింది. ఆమెను కోతులగుట్ట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న కూనవరం సబ్‌ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంధ్య మరణానికి కారణమైన భర్త అఖిల్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular