ePaper
Sunday, May 17, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్ప్రత్తిపాటి సేవా కార్యక్రమాలు ఇతరులకు స్ఫూర్తి : డాక్టర్ పేర్ని కృష్ణమోహన్

ప్రత్తిపాటి సేవా కార్యక్రమాలు ఇతరులకు స్ఫూర్తి : డాక్టర్ పేర్ని కృష్ణమోహన్

📰 Generate e-Paper Clip

ప్రత్తిపాటి శరత్ ఆధ్వర్యంలో భారీ ఉచిత కంటి వైద్య శిబిరం

చిలకలూరిపేట , పెన్ పవర్, మే 17 :  

చిలకలూరిపేట : స్థానిక ఎమ్మెల్యే, మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు డాక్టర్ పేర్ని కృష్ణమోహన్ (అమ్మ దంత వైద్యశాల) ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాసేవను ప్రధాన ధ్యేయంగా తీసుకొని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు.

చిలకలూరిపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 29వ తేదీ శుక్రవారం నిర్వహించనున్న 43వ ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ ఆధ్వర్యంలో ప్రముఖ శంకర్ కంటి వైద్యశాల సహకారంతో ఈ భారీ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

గతంలో ప్రధానంగా కంటి శుక్లాల సమస్యలకు మాత్రమే పరిమితమైన వైద్య సేవలను ఈసారి మరింత విస్తృత స్థాయిలో అందిస్తున్నామని పేర్కొన్నారు. రెటీనా సంబంధిత వ్యాధులు, రెటీనా డిటాచ్మెంట్‌తో పాటు కంటికి సంబంధించిన పలు క్లిష్ట సమస్యలకు నిపుణులైన వైద్యులచే పూర్తిగా ఉచితంగా వైద్య సేవలు అందించనున్నట్లు వెల్లడించారు. సాధారణంగా లక్ష రూపాయలకు పైగా ఖర్చయ్యే అత్యాధునిక చికిత్సలను నిరుపేదలకు ఉచితంగా అందించడం ఈ శిబిరం ప్రత్యేకతగా నిలుస్తుందని తెలిపారు.

చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ఈ అరుదైన అవకాశాన్ని వినియోగించుకొని కంటి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని కోరారు. ప్రజలకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇలాంటి సేవలు అందించడం గొప్ప విషయమని పేర్కొంటూ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, ఆయన తనయుడు శరత్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావును ఆదర్శంగా తీసుకొని చుట్టుపక్కల జిల్లాల్లో కూడా అనేక మంది ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని డాక్టర్ పేర్ని కృష్ణమోహన్ పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ ప్రత్తిపాటి పుల్లారావుకు మరోసారి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular