గిరిజన సమాజ సేవకురాలిగా, సమాజానికి అందించిన సేవలను గుర్తింపు.
ముంచంగిపుట్టు, పెన్ పవర్, జూన్ 16:గిరిజన సమాజ సేవకురాలిగా, సమాజానికి అందించిన మంచి సేవలను గుర్తించి అల్లూరి జిల్లా, ముంచంగిపుట్టు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కిల్లో సన్యాసమ్మ సంధ్యకు మదర్ థెరిసా సేవా సంస్థ “సేవా రత్న రాష్ట్ర స్థాయి అవార్డును” ప్రదానం చేసింది. ఆదివారం విశాఖపట్నంలో ‘మదర్ థెరిస్సా’ సేవ సంస్థ రజతోత్సవ వేడుకల సందర్బంగా డాబాగార్డెన్ వి.జె.ఎఫ్. ప్రెస్ క్లబ్ లో ఆమె గిరిజనులకు అందించిన సేవను గుర్తించి ప్రముఖుల సమక్షంలో మదర్ థెరిస్సా సేవా సంస్థ ‘సేవారత్న రాష్ట్ర స్థాయి అవార్డు’ పురస్కారంతో పాటు, సర్టిఫికెట్, మెడల్, ప్రశంస పత్రం అందించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా అవార్డు గ్రహీత సన్యాసమ్మ సంధ్య మాట్లాడుతూ.. మానవ సేవే మాధవ సేవ అని నిరూపించిన మదర్ థెరిస్సా పేరిట ప్రతిష్టాత్మ సేవారత్న రాష్ట్ర స్థాయి అవార్డు అందుకోవడం సమాజ సేవలో మరింత ముందుకు సాగేందుకు ఎంతో ఉత్సాహ పరిచిందని సామాజిక బాధ్యతను మరింత పెంచిందని, గర్వకారణంగా, సంతోషంగా ఉందని అన్నారు. సేవా రత్న అవార్డు అందుకున్న సన్యాసమ్మ సంధ్య కు మండల, జిల్లా వాసులు అభినందనలు తెలిపారు.

