Homeఆంధ్రప్రదేశ్పోలియో నిర్మూలన మనందరి లక్ష్యం: జనసేన నాయకుడు గబులంగి గణేష్

పోలియో నిర్మూలన మనందరి లక్ష్యం: జనసేన నాయకుడు గబులంగి గణేష్

📰 Generate e-Paper Clip

గూడెం కొత్తవీధి,పెన్ పవర్,జూన్ 27:పోలియో నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని జనసేన పార్టీ రింతాడా పంచాయతీ ప్రధాన కార్యదర్శి గబుళంగి గణేష్ ఒక ప్రకటనలో కోరారు.భారతదేశం పోలియో రహిత దేశంగా నిలిచినప్పటికీ,ఆ స్థితిని కొనసాగించేందుకు నిరంతర ప్రయత్నాలు అవసరమని ఆయన తెలిపారు.ప్రతి ఐదు సంవత్సరాల లోపు ఉన్న చిన్నారికి పోలియో చుక్కలు వేయడం ద్వారా మాత్రమే పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.పోలియో నిర్మూలన కోసం కుటుంబ సభ్యులు, సమాజం, ఆరోగ్య కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల్లో అవగాహన పెంపొందించడం,ప్రతి చిన్నారికి టీకాలు అందేలా చూడడం ద్వారా మాత్రమే పోలియో నిర్మూలన సాధ్యమవుతుందని తెలిపారు. అందువల్ల తల్లిదండ్రులందరూ ఆదివారం నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని, తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular