Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంయాదవ విద్యార్థులకు ఎమ్మెల్యే వంశీకృష్ణ చేతుల మీదుగా ప్రతిభా పురస్కారాలు

యాదవ విద్యార్థులకు ఎమ్మెల్యే వంశీకృష్ణ చేతుల మీదుగా ప్రతిభా పురస్కారాలు

 

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, విశాఖపట్నం జూలై 5: యాదవ విద్యార్థుల్లో విద్యాపట్ల ఆసక్తి, ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో యాదవ ఎంప్లాయీస్ సొసైటీ (YES) ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభా పురస్కారాల కార్యక్రమం ఆదివారం విశాఖలోని సవేరా ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం సమాజాభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. విద్యార్థి దశ నుంచే విద్యపై ఆసక్తి, అంకితభావం పెంపొందించుకుంటే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని పేర్కొన్నారు. విద్యనే జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే శక్తిగా భావించి ప్రతి విద్యార్థి లక్ష్యసాధన దిశగా కృషి చేయాలని సూచించారు. అలాగే పిల్లల విద్యాభివృద్ధికి తల్లిదండ్రులు పూర్తి సహకారం అందించాలని కోరారు.

యాదవ ఎంప్లాయీస్ సొసైటీ కార్యదర్శి డొక్కర శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం, విశాఖ జిల్లా పరిధిలో ఇంటర్మీడియట్‌లో 900కు పైగా మార్కులు, పదో తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించి ప్రతిభా పురస్కారాలు అందజేశారు. నగదు పురస్కారాలతో పాటు కెరీర్ గైడెన్స్ పుస్తకాలు, స్కూల్ బ్యాగులు, పెన్నులు అందించి విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో సంఘం పెద్దలు రాజారావు, చిన్నారావు, యాదవ ఎంప్లాయీస్ సొసైటీ సభ్యులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular