గార్ల, పెన్ పవర్, జూలై 22:
పొట్ట కూటి కోసం సంచార జీవితం గడుపుతూ కుటుంబాలను పోషించుకుంటున్న అర్హులైన బెడ బుడగ జంగాలకు ఇళ్ళ స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్, మండల కార్యదర్శి అలవాల సత్యవతి లు డిమాండ్ చేశారు.మండలం లోని ముల్కనూర్ పంచాయతీ లో నివాసం ఉంటున్న బెడ బుడగ జంగాలకు ఇళ్ల స్థలాలు,ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దార్, ఎంపీడివో కార్యాలయాల ఎదుట ఆందోళన నిర్వహించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కుటుంబాల పోషణ కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా జీవన భృతిని కల్పించేందుకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. బుడగజంగాలు నివసిస్తున్న కాలనీలలో సిసి రోడ్లు,డ్రైనేజీలు, మంచి నీటి సౌకార్యలు,ఇతర మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.మూడు తరాలు గా తాత ల కాలం నుండి ప్రభుత్వ స్థలo లో నివాసాలు ఉంటున్న వారిని రెవెన్యూ భూములలో ఉంటున్నారని అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని వెంటనే వారిపై వేధింపు లు మానాలని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ తాసిల్దార్ శ్రీరామ్ రాథోడ్, ఎంపీడీవో మంగమ్మ ల కు అందజేశారు. ముందుగా బేడ బుడగాల సంక్షేమ సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్థానిక మంగపతి రావు భవనం నుండి పట్టణ పురవీధుల మీదుగా తాసిల్దార్, ఎంపీడీవో కార్యాలయాల వరకు భారీ ప్రదర్శన, ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్య,కా,స మండల కార్యదర్శి వి.పి వెంకటేశ్వర్లు, బేడ బుడగ సంఘాల నాయకులు పస్తం సమ్మయ్య, భూతం వెంకటేష్, మెటo, వీరన్న, కొండపల్లి శ్రీను, కోటేశ్, కోటయ్య, శ్రీను, లక్ష్మీనారాయణ, రమేష్, బిక్షం,రవి, రాములు, రామారావు, వెంకన్న, తదితరులు ఉన్నారు.

