గార్ల పెన్ పవర్, జూలై 22:
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణే లక్ష్యంగా ముల్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ హనుమంతరావు ఆధ్వర్యంలో బుధవారం గార్ల మండల కేంద్రంలోని స్థానిక బాలికల హైస్కూల్ లోని విద్యార్థినులకు ఉచిత హెచ్ పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించి వ్యక్తిగత పరిశుభ్రత వర్షాకాలంలో తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలు హెచ్ పీ వీ వ్యాక్సిన్ పై విద్యార్థినులకు అవగాహన కల్పించి టీకాలు అందజేశారు అనంతరం ఈ సందర్భంగా పీ హెచ్ సి మెడికల్ ఆఫీసర్ డా. బి. హనుమంతరావు మాట్లాడుతూ.పాఠశాలలో 14 ఏళ్ల వయస్సు ఉన్న బాలికలకు హెచ్ పీవీ టీకాలు వేసినట్లు తెలిపారు. టీకా పంపిణీకి ముందే వ్యాక్సిన్ భద్రత, దాని ప్రాముఖ్యత, క్యాన్సర్ నివారణలో టీకా పాత్రపై విద్యార్థినులకు అవగాహన కల్పించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థినిలు ఉపాధ్యాయులు వైద్య సిబ్బంది ఏఎన్ఎం ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

