మరిడిమాంబ జాతరలో సందడి.. విజేతలకు ఎమ్మెల్యే వంశీకృష్ణ చేతుల మీదుగా బహుమతులు
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, జూలై 25 : 31వ వార్డు పరిధిలోని శ్రీ శ్రీ శ్రీ మరిడిమాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. జాతర ఉత్సవాల్లో భాగంగా సరస్వతి పార్క్ వద్ద నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలకు విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అమ్మవారి జాతర సందర్భంగా నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో విజేతలకు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, నగర పోలీసు కమిషనర్‌తో కలిసి బహుమతులు అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మరిడిమాంబ అమ్మవారి జాతరను మరింత వైభవంగా నిర్వహించేందుకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

