Homeతెలంగాణధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల చారిత్రాత్మక విజయం

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల చారిత్రాత్మక విజయం

 

గార్ల, పెన్ పవర్, జులై 25:

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను విద్యార్థులు, యువత విప్లవాత్మక పోరాటాల చారిత్రాత్మక విజయమని బిఆర్ఎస్ పార్టీ గార్ల మండల మాజీ ఎంపీటీసీ శీలంశెట్టి రమేష్ అభివర్ణించారు.ప్రజాస్వామ్యంలో విద్యార్థుల గొంతును అణచివేయాలని చూసిన కేంద్ర ప్రభుత్వానికి ఈ పరిణామం చెంపపెట్టుఅని ఆయన పేర్కొన్నారు. ధర్మేంద్ర రాజీనామాతో గత కొద్ది రోజులుగా విద్యార్థులు చేస్తున్న పోరాటం ఫలించిందని తెలిపారు. గతంలో కెసిఆర్ స్పష్టం చేసినట్లుగా ఇండియా రియాక్ట్స్ అనే నిజానికి ప్రతిరూపంగా నేడు వెలువెత్తిన ఉద్యమం బిజెపి ప్రభుత్వ అహంకారానికి చెంపపెట్టు అన్నారు. ఢీల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ(CJP), తో పాటుగా దేశవ్యాప్తంగా విద్యార్థులు చేసిన పోరాటానికి తలొగ్గి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. విద్యార్థుల నిరసనలను అడ్డుకోవడం, ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడం చివరకు ప్రభుత్వానికే నష్టాన్ని మిగిల్చిందని ఆయన అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడితే దేశ యువత తగిన సమాధానం చెబుతుందని ఈ ఉద్యమ పోరాటం ఒక సందేశం ఇచ్చిందని పేర్కొన్నారు.ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని, విద్యార్థులపైన లాఠీఛార్జి, హింసకు పాల్పడిన వారిపైన కఠినమైన చర్యలు తీసుకువాలని ఆయన డిమాండ్ చేశారు. ‘ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మన దేశ యువత సాధించిన గొప్ప విజయమని. యువతరం కచ్చితంగా ఈ దేశాన్ని మార్చగలరు. మీరు పట్టుబడితే ఏదైనా సాధించగలరు. స్వరం మారుతున్నది నవతరం మారుతున్నది. రాజ్యమా ఉలికిపడు’ అంటూ గర్జించిన యువతరానికి వందనం పాదాభివందనం’ అని శీలంశెట్టి రమేష్ పేర్కొన్నారు. తెలంగాణలో కూడా మూడేళ్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో నిరుద్యోగ యువతలో తీవ్రమైనా అసంతృప్తి పెరిగిపోయిందని ఆయన వెల్లడించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని జెన్‌జీల ఆగ్రహానికి సీఎం గురికావాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular