గార్ల, పెన్ పవర్, జూలై 30:
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ హనుమంతరావు అన్నారు.మహబూబాబాద్ జిల్లా గార్ల మండల పరిధిలోని గండి తండా గ్రామంలో ముల్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గురువారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటుచేసి ప్రజలకు డయాబెటిస్ ప్రాథమిక పరీక్షలు నిర్వహించి తగిన మందులను పంపిణీ చేశారు అనంతరం ఈ సందర్భంగా డాక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ సీజన్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతలను పాటించాలని నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని దోమలు కుట్టకుండా పుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సాధ్యమైనంత ఇంటిలో తయారు చేసిన వేడి ఆహార పదార్థాలను మాత్రమే భుజించాలని 20 నిమిషాలు కాచి చల్లార్చిన నీటిని త్రాగడం వల్ల ఈ సీజన్లో వచ్చే టైఫాయిడ్ వాంతులు విరోచనాలు లాంటి వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చునని వారికి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

