గార్ల పెన్ పవర్ జూలై 30:
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు హెచ్ పి వి పి టీకాలు తప్పనిసరిగా వేయించాలని డాక్టర్ హనుమంతరావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని స్థానిక గర్ల్స్ హై స్కూల్ నిర్మలా హై స్కూల్ లో ముల్కనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో విద్యార్థులకు హెచ్ పి వి టీకాలు వేయగా కొంతమంది విద్యార్థులు తల్లిదండ్రులు టీకాలను నిరాకరించడంతో తల్లిదండ్రులకు విద్యార్థులకు హెచ్ పి వి టీకాల ఉపయోగాల గురించి అవగాహన కల్పించి విద్యార్థులకు టీకాలను అందించారు అనంతరం ఈ సందర్భంగా డాక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ హెచ్ పి వి వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మహిళల్లో గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ ను సమర్థవంతంగా నివారించవచ్చని ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ వ్యాక్సిన్ కు వేల రూపాయలు ఖర్చవుతుండగా ప్రభుత్వ ఆసుపత్రిలో దీనిని పూర్తిగా ఉచితంగా అందిస్తున్నామని 14 నుండి 15 ఏళ్ల వయసు గల బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు వైద్య సిబ్బంది ఉన్నారు.

