Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంఏయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఆచార్య కె. వెంకట సుబ్బయ్య బాధ్యతల స్వీకరణ

ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఆచార్య కె. వెంకట సుబ్బయ్య బాధ్యతల స్వీకరణ

 

ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఆచార్య కె. వెంకట సుబ్బయ్య బాధ్యతల స్వీకరణ

 

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్
విశాఖపట్నం, జూలై 31 : ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల (సీఈ) ప్రిన్సిపాల్‌గా మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం ఆచార్యులు కె. వెంకట సుబ్బయ్య నియమితులయ్యారు. శుక్రవారం ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపకులపతి (వీసీ) ఆచార్య జి.పి. రాజశేఖర్ నుంచి ఆయన నియామక ఉత్తర్వులను స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు పాల్గొన్నారు. అనంతరం సాయంత్రం పదవీ విరమణ చేసిన ఆచార్య ఎం. శశి నుంచి ఆచార్య కె. వెంకట సుబ్బయ్య ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా నూతన ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టిన ఆచార్య కె. వెంకట సుబ్బయ్యకు విశ్వవిద్యాలయ ఆచార్యులు శుభాకాంక్షలు తెలియజేశారు. శుక్రవారంతో ఆచార్య ఎం. శశి ఉద్యోగ విరమణ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular