Homeఆంధ్రప్రదేశ్అనకాపల్లిమరణంలోనూ జీవించే మహోన్నత నిర్ణయం

మరణంలోనూ జీవించే మహోన్నత నిర్ణయం

శరీర, అవయవ దానానికి నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాస్ అంగీకారం

నర్సీపట్నం, పెన్  పవర్, సెప్టెంబర్ 16:

పోలీస్ అధికారిగా శాంతిభద్రతల పరిరక్షణలో నిత్యం బిజీగా ఉంటూనే సమాజ సేవ పట్ల తన బాధ్యతను చాటుతూ నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు శరీర, అవయవ దానానికి ముందుకు వచ్చారు. అనుకోకుండా బ్రెయిన్ డెత్ సంభవిస్తే అవయవాలను, సహజ మరణం పొందితే పార్థివదేహాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయం వైద్య కళాశాలకు అప్పగించేలా తన అంగీకార పత్రాన్ని బుధవారం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో అఖిలభారత శరీర, అవయవదాతల సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మికి అందజేశారు. ఈ సందర్భంగా సీతామహాలక్ష్మి మాట్లాడుతూ డీఎస్పీ శ్రీనివాస్ నిర్ణయం అభినందనీయమని, ఆయన స్ఫూర్తితో రిపోర్టర్ బేరా బాబ్జితో పాటు మరో ఎనిమిది మంది అవయవ దానానికి ముందుకు రావడం హర్షణీయమన్నారు. అవయవదానం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని, శరీరదానం ద్వారా భవిష్యత్ వైద్యులను తీర్చిదిద్దేందుకు దోహదపడవచ్చని తెలిపారు. ప్రజల్లో శరీర, అవయవ దానంపై ఉన్న అపోహలను తొలగించేందుకు తమ సంఘం రెండు దశాబ్దాలుగా కృషి చేస్తోందన్నారు. అవయవ దానం చేయాలనుకునే వారు, అవయవాలు పొందాలనుకునే వారు జీవన్‌దాన్ రాష్ట్ర వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular