Homeసినిమాగూడెం కొత్తవీధిలో సినీ సందడి.. ‘ధీర ధాత్రి’ మూవీకి లొకేషన్ల వేట!

గూడెం కొత్తవీధిలో సినీ సందడి.. ‘ధీర ధాత్రి’ మూవీకి లొకేషన్ల వేట!

ఆగస్టు మూడో వారం నుంచి చిత్రీకరణ ప్రారంభం.. పలు ప్రాంతాలను పరిశీలించిన చిత్ర బృందం

గూడెం కొత్త వీధి, పెన్ పవర్,ఆగష్టు5:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలంలో త్వరలో సినిమా షూటింగ్ సందడి నెలకొననుంది. కంభంపాటి ఫిల్మ్ స్టూడియోస్ నిర్మాణంలో తెరకెక్కనున్న ‘ధీర ధాత్రి’ చిత్రానికి సంబంధించి చిత్ర యూనిట్ మండలంలోని పలు ప్రాంతాల్లో షూటింగ్ లొకేషన్లను పరిశీలించింది.కంభంపాటి విజయ్ కుమార్ నిర్మాతగా, సలాది నవీన్ పవన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ సినిమాలో వంశీ ఆకుల, మహిత ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఆగస్టు మూడో వారం నుంచి సినిమా నిర్మాణం/చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లు చిత్ర బృందం తెలిపింది.గూడెం కొత్తవీధి మండలంలోని ప్రకృతి అందాలు, పచ్చని కొండలు, గ్రామీణ వాతావరణానికి అనువైన పలు ప్రాంతాలను చిత్ర బృందం సందర్శించి పరిశీలించింది. సినిమా కథకు అనుగుణంగా లొకేషన్ల ఎంపికపై దర్శకుడు సలాది నవీన్ పవన్ ప్రత్యేకంగా దృష్టి సారించారు.ఈ లొకేషన్ పరిశీలన కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గొర్లే వీర వెంకట్, సుర్ల వీరేంద్ర కుమార్, పరమేష్ తదితరులు పాల్గొని చిత్ర యూనిట్‌కు సహకరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular