Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంజీవీఎంసీ మధురవాడ జోన్ నూతన ఏసీపీగా పి. గౌరు బాధ్యతల స్వీకరణ

జీవీఎంసీ మధురవాడ జోన్ నూతన ఏసీపీగా పి. గౌరు బాధ్యతల స్వీకరణ

జీవీఎంసీ మధురవాడ జోన్ నూతన ఏసీపీగా పి. గౌరు బాధ్యతల స్వీకరణ

 బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం / మధురవాడ, ఆగస్టు 5: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) మధురవాడ జోన్ నూతన అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ఏసీపీ)గా పి. గౌరు బుధవారం బాధ్యతలు స్వీకరించారు.

గతంలో ఈ పదవిలో పనిచేసిన ఎస్. శాస్త్రి షబ్నమ్ కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్‌కు బదిలీ కావడంతో, డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆదేశాల మేరకు పి. గౌరును మధురవాడ జోన్‌కు నియమించారు.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం పి. గౌరు మధురవాడ జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.

ఈ సందర్భంగా పి. గౌరు మాట్లాడుతూ, జోన్ పరిధిలో పట్టణ ప్రణాళికా నిబంధనలను సమర్థవంతంగా అమలు చేస్తూ, పారదర్శక పరిపాలనతో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular