Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంవిశాఖకు ఏం చేశారో చెప్పలేని స్థితిలో బీజేపీ* *విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్‌ను పి.వి.ఎన్....

విశాఖకు ఏం చేశారో చెప్పలేని స్థితిలో బీజేపీ* *విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్‌ను పి.వి.ఎన్. మాధవ్ కాపాడుతున్నారు*

*విశాఖకు ఏం చేశారో చెప్పలేని స్థితిలో బీజేపీ*

*విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్‌ను పి.వి.ఎన్. మాధవ్ కాపాడుతున్నారు*

*జగన్ మురారి తీవ్ర వ్యాఖ్యలు*

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం,

విశాఖపట్నం, ఆగష్ట 5 :
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం గత 12 ఏళ్లలో విశాఖపట్నం జిల్లా అభివృద్ధికి కేటాయించిన నిధులు, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ నాయకుడు జగన్ మురారి డిమాండ్ చేశారు.

ఈ విషయమై బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజుకు తాము విసిరిన సవాలుకు ఆయన వద్ద సమాధానం లేక మౌనం దాలుస్తున్నారని ఎద్దేవా చేశారు. విశాఖకు కేంద్రం చేసిన మేలేమీ లేకపోవడం వల్లే బీజేపీ నాయకులు ప్రజలను గాలి మాటలతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ఇదే క్రమంలో విశాఖ డైరీ వ్యవహారంపైనా ఆయన సంచలన ఆరోపణలు చేశారు. విశాఖ డైరీలో జరిగిన భారీ అవకతవకలపై పాడి రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారని, దీనిపై అసెంబ్లీ స్పీకర్ నాయకత్వంలో నిజనిర్ధారణ కమిటీని నియమించగానే ఆడారి ఆనంద్ రక్షణ కోసం బీజేపీ గూటికి చేరారని పేర్కొన్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ ఆయనకు వెంటనే రాష్ట్ర ఉపాధ్యక్ష పదవిని కట్టబెట్టి, చట్టపరమైన చర్యల నుంచి కాపాడే రక్షణ కవచంగా మారని విమర్శించారు. పార్టీలో చేరిన నాటి నుంచి ఆడారి ఆనంద్ ప్రజాక్షేత్రంలో గానీ, పార్టీ కార్యక్రమాల్లో గానీ కనిపించకుండా ముఖం చాటేస్తున్నారని జగన్ మురారి ఆరోపించారు.

అవినీతికి పాల్పడిన వారికి బీజేపీ అడ్డాగా మారుతోందనడానికి ఈ సంఘటనే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. @⁨all⁩

RELATED ARTICLES
- Advertisment -

Most Popular