Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంముస్తఫా అరెస్టు రాజకీయ కక్షసాధింపే: వైఎస్సార్‌సీపీ మైనారిటీ విభాగం నేతలు

ముస్తఫా అరెస్టు రాజకీయ కక్షసాధింపే: వైఎస్సార్‌సీపీ మైనారిటీ విభాగం నేతలు

 

 

ముస్తఫా అరెస్టు రాజకీయ కక్షసాధింపే: వైఎస్సార్‌సీపీ మైనారిటీ విభాగం నేతలు

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్
విశాఖపట్నం, ఆగస్టు 5: మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, ఆయన కుమారుడి అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం నాయకులు బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ముస్తఫాపై నమోదు చేసిన కేసు రాజకీయ కక్షసాధింపులో భాగమేనని ఆరోపించారు.

వైఎస్సార్‌సీపీ ఎస్‌ఈసీ సభ్యుడు జహీర్ అహ్మద్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేసి వేధింపులకు పాల్పడుతోందని విమర్శించారు. ముస్తఫా పొగాకు వ్యాపారానికి సంబంధించి రూ.30 లక్షలు చెల్లించినప్పటికీ సరుకు అందకపోవడంతో జరిగిన వ్యాపార వివాదాన్ని ఉద్దేశపూర్వకంగా “కిడ్నాప్” కేసుగా చిత్రీకరించారని ఆరోపించారు. సంబంధిత వ్యక్తులను చివరికి పోలీసులకే అప్పగించిన నేపథ్యంలో కిడ్నాప్ ఆరోపణలు చేయడం రాజకీయ కుట్రలో భాగమని పేర్కొన్నారు.

జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షుడు బర్కత్ అలీ మాట్లాడుతూ, ముస్తఫాపై నమోదు చేసిన కేసు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైందని ఆరోపించారు. కాజా టోల్‌ప్లాజా, పెదకాకాని పోలీస్ స్టేషన్‌ల సీసీటీవీ దృశ్యాలను ప్రభుత్వం బహిర్గతం చేస్తే అసలు వాస్తవాలు బయటపడతాయని అన్నారు. ఈ కేసుపై హైకోర్టును ఆశ్రయించి చట్టపరంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ముస్లిం నాయకులను లక్ష్యంగా చేసుకుని వేధింపులు జరుగుతున్నాయని, ఇటువంటి చర్యలకు భయపడబోమని తెలిపారు.

జిల్లా షేక్ విభాగం అధ్యక్షుడు ఎం.డి. షరీఫ్ మాట్లాడుతూ, సమగ్ర విచారణకు ముందే మాజీ ప్రజాప్రతినిధి ముస్తఫా, ఆయన కుమారుడిని అరెస్టు చేయడం బాధాకరమని అన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తర్వాతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిర్దోషులపై వేధింపులు నిలిపివేయాలని కోరారు.

ఈ సమావేశంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ ఆర్టీఐ విభాగం అధ్యక్షుడు ఎస్.కే. బాబ్జి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular