2029 ఎన్నికలే లక్ష్యం.. ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలి
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ముందుకు: పల్లా శ్రీనివాసరావు
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం/ కూర్మన్నపాలెం,ఆగస్టు 09:
2029 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లి మరింత చురుకుగా పనిచేయాలని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.
మహా విశాఖ నగర పాలక సంస్థ (GVMC) 86వ వార్డు రాజీవ్‌నగర్‌లో స్థానిక వార్డు అధ్యక్షుడు నల్లూరు సూర్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డులో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గాజువాక నియోజకవర్గంలోని అన్ని వార్డుల్లో కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. 86వ వార్డులోనే సుమారు రూ.17 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. అలాగే ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సుమారు రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు.
పార్టీలోకి 50 మంది చేరిక
కార్యక్రమంలో రాసాలమ్మ కాలనీ విశ్వబ్రాహ్మణ సంఘం, కొత్త రసాలమ్మ కాలనీ, పెద్దయాతపాలెం ప్రాంతాలకు చెందిన సుమారు 50 మంది పల్లా శ్రీనివాసరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, వార్డు జనసేన నాయకుడు కాదా శ్రీను, వార్డు క్లస్టర్ ఇన్‌చార్జి వేగుంట శ్రీనివాస్, నాయకులు జగదీశ్, రమేష్, గణపతి, నాగార్జున, వెంకటేష్, సుబ్బయ్య, అరిపాక లక్ష్మణరావు, రమణారావు, నాయుడు, సాగి శ్రీను, సింహాద్రి, పాలవల్లి, నూక అప్పారావు, తలారి శ్రీను, రామకృష్ణ రాజు, అప్పలస్వామి, లోవరాజు, తులసిరావు, గోవింద్ ప్రధాన్, మదీనా వల్లి, పీరుబాబా, రుక్మిణి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

