గార్ల, పెన్ పవర్, ఆగస్టు 12:
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గార్ల మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, దోమల నివారణ, పచ్చదనం పరిరక్షణకు అవసరమైన నూతన అత్యాధునిక పరికరాలను పంచాయతీ ఆధ్వర్యంలో కొనుగోలు చేశారు. పంచాయతీ ఆవరణలో బుధవారం నూతన పరికరాలను సర్పంచ్ పార్వతి హతిరాం నాయక్ ప్రారంభించారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులను మరింత వేగవంతం చేసేందుకు రెండు ఫాగింగ్ మిషన్లు, రెండు తైవాన్ పవర్ స్పేర్ పంపులు, రెండు గ్రాస్ కటింగ్ మిషన్లు, 16 డస్ట్‌బిన్లు, రెండు గార్డెన్ కత్తెరలు, రెండు కొమ్మలు కటింగ్ మిషన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటితోపాటు వీధిలైట్లు, బ్లీచింగ్ పౌడర్ ఏర్పాట్లు కూడా చేపట్టారు.నూతన పరికరాల ద్వారా దోమల నివారణకు ఫాగింగ్ నిర్వహించడంతో పాటు గ్రామంలోని పారిశుద్ధ్య పనులను వేగవంతంగా చేపట్టేందుకు అవకాశం ఉంటుందని సర్పంచ్ పార్వతి హతిరాం నాయక్ తెలిపారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గ్రామ పరిశుభ్రతను కాపాడేందుకు ప్రజలు కూడా పంచాయతీకి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎండీ జరీనా బేగం, వార్డు సభ్యులు తోడేటి శ్రీనివాస్, ఎండీ రహీం ఖాన్, పంచాయతీ సిబ్బంది సుధాకర్, సైజాద్, శ్రీనివాసరావు, దాసు, వెంకన్న, బాబు,

