Homeఆంధ్రప్రదేశ్అనకాపల్లినర్సీపట్నం మున్సిపాలిటీలో మూడు వార్డుల్లో పద్మావతి ముమ్మర పర్యటన

నర్సీపట్నం మున్సిపాలిటీలో మూడు వార్డుల్లో పద్మావతి ముమ్మర పర్యటన

21, 22, 23 వార్డుల్లో రూ. 1.94 కోట్ల పనులకు శ్రీకారం…

నర్సీపట్నం, పెన్ పవర్:

నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని 21, 22, 23వ వార్డుల్లో నూతనంగా మంజూరైన అభివృద్ధి పనులను  స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి సోమవారం ముఖ్య అతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టి, శిలాఫలకాలను ఆవిష్కరించి లాంఛనంగా ప్రారంభించారు. ఆయా వార్డుల్లో పర్యటించిన ఆమెకు స్థానిక ప్రజలు, మహిళలు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. VMRDA, 15వ ఆర్థిక సంఘం, DMFT నిధుల ద్వారా ఈ మూడు వార్డులకు కలిపి సుమారు రూ. 1.94 కోట్ల అంచనా వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టుల నిర్మాణాలు చేపట్టారు. ఇందులో 21వ వార్డుకు రూ. 34.62 లక్షలు, 22వ వార్డుకు రూ. 78.60 లక్షలు, 23వ వార్డుకు రూ. 80 లక్షలు వెచ్చించి ఈ మౌలిక వసతులను కల్పిస్తున్నారు.


ఈ సందర్భంగా చింతకాయల పద్మావతి మాట్లాడుతూ.. గత పదిహేను రోజులుగా నర్సీపట్నం మున్సిపాలిటీలో ముమ్మరంగా ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నామని, మొత్తం 189 రోడ్లు, కాలువలు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. గత ఐదేళ్ల ప్రభుత్వంలో మున్సిపాలిటీ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని, అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్పీకర్ అయ్యన్నపాత్రుడు కృషితో మున్సిపాలిటీకి ఏకంగా రూ. 32 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఆమె గుర్తుచేశారు.

ప్రజల మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని స్పష్టం చేశారు. రాబోయే ఏడాదిన్నర కాలంలో నర్సీపట్నంలో ప్రతి ఇంటికీ తాగునీటి కుళాయి అందించాలన్న సంకల్పంతో రూ. 185 కోట్లతో ఇంటింటికీ కుళాయి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు పద్మావతి వెల్లడించారు. పార్టీలకు అతీతంగా మున్సిపాలిటీ పరిధిలో ఏ వార్డులో సమస్య ఉన్నా పరిష్కరించి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమించే నాయకులను ఎన్నుకోవడం వల్లే ఇలాంటి అభివృద్ధి సాధ్యపడుతోందని, ప్రజల గురించి ఆలోచించే మంచి వ్యక్తులను ఎల్లప్పుడూ ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, స్పీకర్ అయ్యన్నపాత్రుడికి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాలుమూరి రాజకుమార్, పెదిరెడ్ల చింతు, దివ్య రాజేష్, దన్నిన రాంబాబు, చంద్రిక, బాబ్జి, రమేష్, నాగరాజు, ప్రసాద్, తాతబాబు, భద్రర్రావు, లక్ష్మి తదితరులతో పాటు 28వార్డుల ఇంచార్జ్ లు, జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి శ్రేణులు, స్థానిక ప్రజలు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular