గార్ల, పెన్ పవర్, ఆగస్టు 13:
దేశంలోని ప్రజా వ్యతిరేక బీజేపీ పాలన నుండి ప్రజలకు విముక్తి కల్పించేందుకే సిపిఐ పోరాటం కొనసాగిస్తున్నదని సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయ సారధి అన్నారు. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో గార్ల మండలంలో ఆగస్టు 6న ప్రారంభమైన ప్రజా చైతన్య యాత్ర వారం రోజులుగా కొనసాగుతూ గురువారం ముగింపు సందర్భంగా స్థానిక నెహ్రూ సెంటర్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.అన్ని వర్గాల ప్రజలపై ధరలభారం మోపుతున్న బిజెపిని మార్చాలని ప్రజలకు పిలుపునిచ్చారు నిత్యవసర సరుకుల ధరలను నియంత్రించడంలో మోడీ 12 ఏళ్ల పాలనలో పూర్తిగా వైఫల్యం చెందాడని ఇక మార్పు తద్యం అన్నారు. ప్రజా సంపద కొల్లగొట్టి అంబానీ ఆదానీలకే మోడీ దోచి పెడుతున్నాడు అన్నారు 12 ఏళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని అన్నారు దేశంలో ప్రజలందరూ మోడీపై తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారని ఓటమి భయం మోడీకి పట్టుకుందని రాముని సొమ్ము కాజేసిన బిజెపి ప్రభుత్వానికి పతనం తప్పదన్నారు. రాష్ట్రాల హక్కులు మోడీ హరిస్తున్నాడని బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని మహబూబాబాద్ జిల్లాలో రైల్వే మైంటైన్స్ డిపో పరిశ్రమ ఏర్పాటు చేసి వేలాదిమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన వివరించారు. రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని అన్నారు తెలంగాణ మీద సవతి తల్లి ప్రేమ బిజెపి మోడీ కనబరుస్తున్నారని మున్నేరు పాలేరు లింకు కెనాల్ జీవో నెంబర్ 98 ని రద్దు చేసి ఈ ప్రాంత రైతాంగాన్ని అందుకోవాలని కోరారు.ఈ ప్రచార యాత్ర ముగింపు కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు కట్టెబోయిన శ్రీనివాస్ సిపిఐ మండల కార్యదర్శి జంపాల వెంకన్న, రాగం రమేష్, మేదరమెట్ల గిరిప్రసాద్, భూక్య హరినాయక్, సారిక శ్రీనివాస్, వార్డు సభ్యులు నీలమ్మ,వెంకటనరసమ్మ ,ధూపాటి జనార్ధన్,సింగు రమేష్, బట్టు వీరన్న,ధారవత్ వీరన్న, భుక్య పుల్ సింగ్, దార్ల నాగేష్, బాదం రాజేష్, సుధాకర్ రెడ్డి, భీమ్లా పిచ్చయ్య శ్రీను తదితరులు పాల్గొన్నారు.

