ఎమ్మెల్యే కోరం కనకయ్య
గార్ల, పెన్ పవర్, ఆగస్టు 14:
రాంపురం గార్ల హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. గార్ల మండలంలో శుక్రవారం ఆయన సుడిగాలి పర్యటన నిర్వహించి పలు అభివృద్ధి, కార్యక్రమాలను ప్రారంభించారు.తొలుత సీతంపేట గ్రామంలో సర్పంచ్ గుగులోత్ వీర్యా నాయక్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు తడి, పొడి చెత్త సేకరణ కోసం బకెట్లను పంపిణీ చేశారు గ్రామాల పరిశుభ్రతలో ప్రజలు భాగస్వాములు కావాలని తడి పొడి చెత్తను వేరుగా చేసి పారిశుద్ధ సిబ్బందికి అందించాలని సూచించారు. ఇందిరమ్మ లబ్ధిదారులతో కలిసి సీతంపేట గార్ల లో రిబ్బన్ కట్ చేసి ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు అనంతరం గార్ల మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే నూతన శవపరీక్ష కేంద్రాన్ని ప్రారంభించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న వారికి అందించే పౌష్టికాహారం నాణ్యతను తెలుసు కునేందుకు వంటగదిని తనిఖీ చేశారు. రోగులకు నాణ్యమైన ఆహారంతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. రాంపురం–గార్ల హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించి. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే నిర్మాణంలో ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని, నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బ్రిడ్జి అందుబాటులోకి వస్తే మండల ప్రజల రవాణా కష్టాలు తీరడంతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.పెద్దకిష్టాపురం సర్పంచ్ గంగావత్ రామ్ సింగ్ నాయక్ తో కలిసి గ్రామపంచాయతీ కార్యాలయంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, మినీ బ్యాంకును ప్రారంభించి మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీతక్క రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిల సహకారంతో రాంపురం గార్ల ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా మారిన పాకాల చెక్ డ్యామ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపడుతున్నామని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న పాకాల ఏటి హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణాన్ని ఏడాదిలోగా పూర్తి చేసి బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజల చిరకాల కలను నెరవేరుస్తామని అన్నారు. హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణంతో రాంపురం మద్దివంచ పరిసర గ్రామాల ప్రజల కష్టాలు తీరుతాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్లు చేపట్టిన పథకం ద్వారా ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తికావడం లబ్దిదారు లు నూతన గృహప్రవేశం చేయడం ఎంతో సంతోషంగా ఉన్నదన్నారు.ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు వాస్తవ రూపం దాలుస్తున్నాయన్నారు.పేద ప్రజల సొంతింటి కల ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సాధ్యమైందని అన్నారు. నిరుపేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించే విధంగా ప్రభుత్వం అందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నదని అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. హై లెవెల్ బ్రిడ్జి వచ్చేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య తో పాటుగా పిఎసిఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ లను సిపిఐ నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ పర్యటనలో ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ బానోతు రాంబాబు గార్ల పిఎసిఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తాళ్లపల్లి కృష్ణ గౌడ్ జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యురాలు శంషాద్ బేగం ఎంపీడీవో మంగమ్మ తాసిల్దార్ శారద వ్యవసాయ శాఖ అధికారి రామారావు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్య నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గుండా వెంకట్ రెడ్డి సర్పంచులు భానోత్ పార్వతి హతిరాం బానోత్ మోతిలాల్ భూక్యరామ్ సింగ్ బట్టు అనిత వెంకట్రావు సుశీల రమ్య నాగార్జున సరోజ రవి ప్రమీల వీరన్న కాంగ్రెస్ నాయకులు కిషన్ యాకూబ్ పాషా అశోక్ బాబు లాల్ కోల కుమార్ వైద్య సిబ్బంది ఇరిగేషన్ సిబ్బంది అంగన్వాడీ సిబ్బంది గ్రామపంచాయతీ సిబ్బంది వివిధ పార్టీల నాయకులు అధికారులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

