Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంసర్దార్ గౌతు లచ్చన్న సేవలు చిరస్మరణీయం

సర్దార్ గౌతు లచ్చన్న సేవలు చిరస్మరణీయం

 

సర్దార్ గౌతు లచ్చన్న సేవలు చిరస్మరణీయం

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్
విశాఖపట్నం, ఆగస్టు 16: స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రముఖ కర్షక నాయకుడు, అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలను పురస్కరించుకుని విశాఖ నగర పోలీసు కమిషనరేట్‌లో ఆయనకు ఘన నివాళులర్పించారు. నగర పోలీసు కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి, ఐపీఎస్., లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, రైతాంగ హక్కుల పరిరక్షణ, కార్మిక సంక్షేమం కోసం సర్దార్ గౌతు లచ్చన్న సాగించిన పోరాటాలు అసాధారణమైనవని కొనియాడారు. బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి ఎదురొడ్డి నిలవడంతో పాటు, స్వతంత్ర భారతదేశంలోనూ ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ఆయన నిరంతరం కృషి చేశారని తెలిపారు.

ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో రైతాంగ సమస్యలపై లచ్చన్న చేపట్టిన చారిత్రాత్మక ఉద్యమాలు, శ్రామిక వర్గాల పక్షాన ఆయన చేసిన రాజీలేని పోరాటాలు నేటి తరానికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా ప్రజల పక్షానే నిలబడిన ఆయన రాజకీయ నిబద్ధత ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని కమిషనర్ శంఖబ్రత బాగ్చి అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular