Homeఆంధ్రప్రదేశ్పోలవరంస్థానిక ఎన్నికలకు జనసేన శ్రేణులు సిద్ధం కావాలి

స్థానిక ఎన్నికలకు జనసేన శ్రేణులు సిద్ధం కావాలి

 

రంపచోడవరం నియోజకవర్గంలో బలమైన స్థానాల్లో పోటీకి కార్యాచరణ

రాష్ట్ర సాంస్కృతిక సృజనాత్మక కమిటీ చైర్మన్ వంపూరి గంగులయ్య

గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్, ఆగస్టు 18: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని రాష్ట్ర సాంస్కృతిక సృజనాత్మక కమిటీ చైర్మన్ వంపూరి గంగులయ్య పిలుపునిచ్చారు. కూటమి తరఫున రంపచోడవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ బలంగా ఉన్న స్థానాల్లో పోటీ చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు.మంగళవారం రంపచోడవరం మండలం సీతపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఆయన స్థానిక నాయకులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. రానున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులు గ్రామస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి, వాటి ద్వారా ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలను తెలియజేయాలని గంగులయ్య అన్నారు. గ్రామాల్లో పార్టీ కార్యకలాపాలను విస్తృతం చేసి జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు.
రంపచోడవరం నియోజకవర్గంలో జనసేన పార్టీకి బలమైన స్థానాలను గుర్తించి, కూటమి తరఫున అక్కడ పోటీ చేసే విధంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులు ఇప్పటి నుంచే ప్రజల్లో ఉంటూ గ్రామస్థాయిలో తమ పరిచయాలను పెంచుకోవాలని సూచించారు.త్వరలో జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను రంపచోడవరం నియోజకవర్గంలో పర్యటించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు గంగులయ్య తెలిపారు. పార్టీ బలోపేతం కోసం రానున్న రోజుల్లో రంపచోడవరం, చింతూరు డివిజన్లలో విస్తృతంగా పర్యటిస్తానని చెప్పారు.
స్థానిక ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతగా పనిచేయాలని, గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు సమిష్టి కృషి చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో రంపచోడవరం నియోజకవర్గానికి చెందిన పివోసి కుర్ల రాజశేఖరరెడ్డి, కాకి స్వామి రాగాల సురేష్, మండల అధ్యక్షులు పి ఆర్పీ శ్రీను, కుంజం సిద్దు, పుష్ప రాజు, మడివి రాజు,నరేంద్ర కుమార్,రాయుడు,త్రిమూర్తులు, దుర్గ ప్రసాద్, తీగల కవిత, హేమంత్ రాజేంద్ర, సాయి, జై రామ్,, సురేష్ రెడ్డి,కృష్ణ రెడ్డి, విష్ణు, గవరాజు, కంగాల శివ, బద్రి,లోకేష్, సాయి కుమార్, అప్పారావు, వినోద్, అప్పారావు, నాగబాబు,రమణి వర లక్ష్మి,విశాలాక్షి, పావని,తదితరులు పెద్ద ఎత్తున జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular