Homeతెలంగాణహరిత గ్రామాలే లక్ష్యంగా వన మహోత్సవం

హరిత గ్రామాలే లక్ష్యంగా వన మహోత్సవం

 

గార్ల ,పెన్ పవర్ ,ఆగస్టు 25:

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలంటే విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఎంపీడీవో మంగమ్మ అన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఎంపీడీవో మంగమ్మ మర్రిగూడెం సర్పంచ్ భూక్య రామ్ సింగ్ తో కలిసి మర్రిగూడెం శ్రీ వేట వెంకటేశ్వర దేవాలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు అనంతరం ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొక్కలు నాటడం కార్యక్రమాన్ని ఒకరోజుకే పరిమితం చేయకుండా వాటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. గ్రామాల్లో పచ్చదనం పెంపొందించడం ద్వారా ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవచ్చన్నారు.ప్రతి గ్రామాన్ని హరిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారుమొక్కను నాటడం కంటే దాన్ని సంరక్షించడమే ముఖ్యమని, నాటిన ప్రతి మొక్కను బాధ్యతగా పెంచితేనే వనమహోత్సవం కార్యక్రమం లక్ష్యం నెరవేరుతుందన్నారు. భవిష్యత్ తరాల కోసం ప్రతి కుటుంబం కనీసం కొన్ని మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మర్రిగూడెం గ్రామపంచాయతీ ఏపీవో మాధవి ఉప సర్పంచ్ బానోత్ జిల్లి కార్యదర్శి మోతీలాల్ ఈజీఎస్ సిబ్బంది ఫీల్ అసిస్టెంట్ హరికిషన్ టెక్నికల్ అసిస్టెంట్ రవి గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular