Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజురేపు జీకే వీధిలో వైఎస్సార్‌సీపీ ఆత్మీయ సమావేశం 

రేపు జీకే వీధిలో వైఎస్సార్‌సీపీ ఆత్మీయ సమావేశం 

  • గూడెంకొత్తవీధి, ఆగస్టు 26: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండల కేంద్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం గురువారం నిర్వహించనున్నట్లు మండల ఎంపీపీ బోయిన కుమారి తెలిపారు. పాడేరు ఎమ్మెల్యే మత్స్యరస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది.స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడంతో పాటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యే దిశానిర్దేశం చేయనున్నట్లు పేర్కొన్నారు. మండలంలోని వైఎస్సార్‌సీపీ నాయకులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular