- 27న పాడేరులో సమన్వయ కమిటీ సమావేశం
- స్టాఫ్ రిపోర్టర్, పాడేరు, పెన్ పవర్, ఆగస్టు 25: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా పాడేరు నియోజకవర్గంలోని ప్రతి మండలానికి ఏడుగురు సభ్యులతో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసినట్లు పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ వంపూరు గంగులయ్య తెలిపారు. ఆయా కమిటీ సభ్యులు తమ పరిధిలోని పంచాయతీల వారీగా సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవులకు పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్న ఆశావహుల వివరాలను సేకరించాలని సూచించారు. రెండు మూడు రోజుల్లోగా పూర్తి సమాచారాన్ని అందజేయాలని, పార్టీ బలోపేతానికి కృషి చేసే వారికి అభ్యర్థుల జాబితాలో ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. సేకరించిన వివరాలపై కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా చర్చించి, అనంతరం పార్టీ అధిష్ఠానానికి నివేదిక అందజేయనున్నట్లు తెలిపారు. సమన్వయ కమిటీ సభ్యులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.మండలాల వారీగా నియమించిన సమన్వయ కమిటీ సభ్యులతో ఈ నెల 27న పాడేరులోని జనసేన పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నట్లు గంగులయ్య తెలిపారు. అప్పటికి సేకరించిన వివరాలతో సభ్యులు సమావేశానికి హాజరు కావాలని సూచించారు. మిగిలిన అంశాలపై సమావేశంలో దిశానిర్దేశం చేస్తామని పేర్కొన్నారు.
స్థానిక ఎన్నికలపై జనసేన సమన్వయ కమిటీలకు బాధ్యతలు
RELATED ARTICLES

