గార్ల, పెన్ పవర్, ఆగస్టు 27:
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం లోని గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని మెరుగుపరచాలని కోరుతూ గార్ల మండల సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో అధ్యక్షులు గంగావత్ రామ్ సింగ్ ప్రధాన కార్యదర్శి భూక్య రామ్ సింగ్ లు గురువారం తెలంగాణ టి జి ఎస్ ఆర్ టి సి మహబూబాబాద్ ఇల్లందు డివిజన్ డిపో అధికారులకు వినతి పత్రం సమర్పించారు గార్ల మండలంలోని పలు గ్రామాల ప్రజలు విద్యా వైద్యం ఉపాధి ఇతర అత్యవసర అవసరాల కోసం ఖమ్మం మహబూబాబాద్ ఇతర పట్టణాలకు రాకపోకలు సాగిస్తున్నారని గార్ల మండలాన్ని జిల్లా పరంగా మహబూబాబాద్ కు కేటాయించి నియోజకవర్గ పరంగా ఇల్లేందుకు కేటాయించడంతో ఈ రెండు డిపోల నుండి కనీస బస్సు సౌకర్యాలు ఇప్పటివరకు ఏర్పాటు చేయకుండా తీరని అన్యాయం అసౌకర్యానికి గురి చేయడం జరుగుతుందని ప్రత్యేకంగా ఉదయం సాయంత్రం వేళల్లో విద్యార్థులు ఉద్యోగులు కూలీలు వ్యాపారులు మండల పరిసర ప్రాంతాల గ్రామాల నుంచి మహబూబాబాద్ ఖమ్మం పట్టణాలకు వెళ్లి వచ్చేందుకు సరైన ఆర్టిసి బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇల్లందు నుండి గంధంపల్లి మీదుగా సీతంపేట గార్ల గోపాలపురం పోచారం గేటు కారేపల్లి ఖమ్మం కు ఖమ్మం నుండి సత్యనారాయణపురం వరకు మహబూబాబాద్ నుండి సత్యనారాయణపురం ముల్కనూరు గార్ల గోపాలపురం పోచారం ఖమ్మం కు ఖమ్మం నుండి గంధంపల్లి వరకు బస్సు సర్వీసులను పునరుద్ధరించడంతోపాటు అవసరమైన చోట కొత్త సర్వీసులను ప్రారంభించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. బస్సు సౌకర్యం కల్పించడం వల్ల మండలంలోని 20 గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తమ వినతిపై సానుకూలంగా స్పందించి త్వరితగతిన బస్సు సర్వీసులను ఏర్పాటు చేయాలని కోరారు.

