వంచులలో వైసీపీకి బలం

  • కూటమి నుంచి పలువురు నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరిక
  • గూడెంకొత్తవీధి,పెన్ పవర్ ఆగస్టు 27:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన వైఎస్సార్‌సీపీ ఆత్మీయ సమావేశంలో వంచుల పంచాయతీకి చెందిన పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు వనపల రాజేష్‌, సీనియర్‌ నాయకుడు లొంజా గణపతి ఆధ్వర్యంలో వారు పాడేరు ఎమ్మెల్యే, జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేసి శతశాతం విజయం సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజలకు చేరువ కావాలని సూచించారు. ఈ సందర్భంగా కొర్ర చిట్టిబాబు, దారకాని మోహన్‌, గుంట కొమ్ములు, కొర్ర రాంబాబు, వంతల అరుణ్‌కుమార్‌, కొర్ర సోమనాథ్‌, రీమల కోటేశ్వరరావు తదితరులు ఎమ్మెల్యే సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకుని వైఎస్సార్‌సీపీలో చేరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ వనపల కాసులమ్మ, పంచాయతీ వైఎస్సార్‌సీపీ నాయకులు అరడ సత్తిబాబు, పాంగి చిట్టిబాబు, పొత్తురు గంగరాజు, రఘునాథ్‌, కృష్ణ, జానకిరామ్‌, వంతల చిన్నబ్బాయి తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular