పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్న బద్రి
చింతూరు, పెన్ పవర్, సెప్టెంబర్ 7:
అరకు పార్లమెంట్ పరిధిలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం జనసేన పార్టీ ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీలో కూనవరం మండలానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు బుడుగుల బద్రికి కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా బుడుగుల బద్రి మాట్లాడుతూ. జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి జనసైనికుడికి జనసేనలో తప్పకుండా గుర్తింపు లభిస్తుందని, అందుకు తానే ఒక ఉదాహరణ అని బద్రి పేర్కొన్నారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని తెలిపారు. బద్రికి కీలక బాధ్యతలు అప్పగించడంపై అరకు పార్లమెంట్ పరిధిలోని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.

