Homeఆంధ్రప్రదేశ్పోలవరంవైద్య ఆరోగ్య ఉద్యోగులారా ఏకం కండి

వైద్య ఆరోగ్య ఉద్యోగులారా ఏకం కండి

 

సెప్టెంబర్ 13న రంపచోడవరంలో జరిగే మహాసభను జయప్రదం చేయాలి

గంగవరం, పెన్ పవర్ సెప్టెంబర్ 4: వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ ఐక్యంగా ఉండి తమ సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా పోరాడాలని యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ పోలవరం జిల్లా ముఖ్య సలహాదారు బి. యోహాన్ పిలుపునిచ్చారు.
నూతనంగా ఏర్పడిన పోలవరం జిల్లా కేంద్రంలో తొలిసారిగా నిర్వహించనున్న యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ మహాసభను జయప్రదం చేసేందుకు స్థానిక పిడతమామిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి యూనియన్ పోలవరం జిల్లా అధ్యక్షురాలు పి. సత్యవతి, జిల్లా కార్యదర్శి కె. రాఘవ అధ్యక్షత వహించారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న బి. యోహాన్ మాట్లాడుతూ వైద్య, ఆరోగ్య శాఖలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారానికి ఉద్యోగుల ఐక్యత ఎంతో అవసరమన్నారు. ఈ నెల 13వ తేదీన రంపచోడవరంలో జరగనున్న మహాసభను ఉద్యోగులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఉద్యోగుల సంక్షేమం కోసం యూనియన్ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ఇటీవల స్థానికంగా పనిచేస్తున్న సీనియర్ గిరిజన ఎంపీహెచ్‌ఎస్ ఫిమేల్ ఉద్యోగులకు పీహెచ్‌ఎన్‌లుగా పదోన్నతులు లభించడంలో యూనియన్ కృషి చేసిందన్నారు.రానున్న రోజుల్లో ఎల్‌హెచ్‌వీ శిక్షణ పూర్తి చేసుకున్న సీనియర్ ఏఎన్‌ఎంలకు హెచ్‌వీ పదోన్నతులు ఇవ్వాలని, సీనియర్ హెల్త్ అసిస్టెంట్ మేల్ ఉద్యోగులకు ఎంపీహెచ్‌ఎస్ పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు తదితర అన్ని క్యాడర్లలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరారు.సచివాలయ ఏఎన్‌ఎంలు రెండు శాఖల నుంచి ఎదుర్కొంటున్న అధిక పని ఒత్తిడిని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అర్హత కలిగిన కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని, అప్పటి వరకు వారికి 100 శాతం గ్రాస్ వేతనం చెల్లించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
ఈ సమావేశంలో యూనియన్ పోలవరం జిల్లా ఉపాధ్యక్షులు బి. దుర్గారావు, ఎగ్జిక్యూటివ్ సభ్యురాలు పి. పాపతో పాటు వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular