Homeఆంధ్రప్రదేశ్కాకినాడపోషకాహార లోపాలను అధిగమించేందుకు పోషన్ మాసం

పోషకాహార లోపాలను అధిగమించేందుకు పోషన్ మాసం

కాజులూరు, పెన్‌పవర్‌, సెప్టెంబర్‌ 9:
గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాలను గుర్తించి, సకాలంలో తగిన పోషకాహారం అందించడం ద్వారా ఆరోగ్య సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పోషణ్‌ మాసం కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తాళ్లరేవు ఐసీడీఎస్‌ ప్రాజెక్టు , సీడీపీవో వై.శ్రీదేవి అన్నారు. కాజులూరు మండల పరిధిలోని గొల్లపాలెం ఐసీడీఎస్‌ సెక్టార్‌లో బుధవారం సీడీపీవో వై.శ్రీదేవి అధ్యక్షతన పోషణ్‌ మాసం–2026 కార్యక్రమాన్ని ప్రారంభించారు.
‘మన అంగన్‌వాడీ.. మన బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సూపర్మావైజర్ కె.రమణకుమారి ట్లాడుతూ ప్రతి నెలా అంగన్‌వాడీ పరిధిలోని గర్భిణీలు, చిన్నారుల్లో రక్తహీనత, పోషకాహార లోపాలను గుర్తించి, వారి ఆరోగ్య పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని అంగన్‌వాడీ కార్యకర్తలకు సూచించారు. రక్తహీనత నివారణతో పాటు తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.
పోషణ్‌ మాసం కార్యక్రమం నెలరోజుల పాటు సెప్టెంబర్‌ 9 నుంచి అక్టోబర్‌ 9వ తేదీ వరకు కొనసాగుతుందని ఆమె వివరించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, పిల్లల తల్లులు, అంగన్‌వాడీ కార్యకర్తలకు పోషకాహారం, రక్తహీనత నివారణ, తల్లీబిడ్డల ఆరోగ్యం తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
తక్కువ ఖర్చుతోనే ఎక్కువ కేలరీలు, పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను పిల్లలకు అందించవచ్చని ఆమె తెలిపారు. స్థానికంగా లభించే పౌష్టికాహార పదార్థాలతో సమతుల్య ఆహారం తయారు చేసి పిల్లలకు అందించాలని సూచించారు. చిన్నారులకు ప్రతిరోజూ మంచి పౌష్టికాహారం అందిస్తే వారు శారీరకంగా, మానసికంగా బలంగా ఎదుగుతారని తల్లులకు వివరించారు.
అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పోషకాహార లోపాలున్న చిన్నారులు, గర్భిణీలను గుర్తించి వారికి అవసరమైన సేవలు అందించడంలో సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని రమణకుమారి సూచించారు.
ఈ కార్యక్రమంలో సెక్టార్‌ సూపర్‌వైజర్‌ కె.రమణకుమారి, అంగన్‌వాడీ కార్యకర్తలు వరలక్ష్మి, వసంతకుమారి, సుబ్బయ్యమ్మ, పోతురాజు నాగమణి, కేకేడీ పద్మావతి, అంగన్‌వాడీ చిన్నారులు, గర్భిణీలు, పిల్లల తల్లులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular