Homeఆంధ్రప్రదేశ్తూర్పు గోదావరికొవ్వూరులో సెప్టెంబర్ 11న వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ స్థాయి సమావేశం-

కొవ్వూరులో సెప్టెంబర్ 11న వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ స్థాయి సమావేశం-

-మాజీ ఎమ్మెల్యే తలారి
కొవ్వూరు, పెన్ పవర్, సెప్టెంబర్ 9:
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొవ్వూరు నియోజకవర్గ స్థాయి సమావేశం ఈ నెల 11వ తేదీ, శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నారని కొవ్వూరు నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక వైశ్య కళ్యాణ మండపంలో ఈ సమావేశం జరగనుందని అన్నారు.
కొవ్వూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ క్యాంపు కార్యాలయ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం… నియోజకవర్గ పరిధిలోని అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందరూ సమావేశానికి హాజరవ్వాలని తెలియజేశారు. పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కావున ప్రతి ఒక్కరూ తప్పకుండా విచ్చేసి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ ముఖ్య నాయకులు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular