Homeతెలంగాణరంగారెడ్డిపెట్రోల్ పంప్‌ లోకి దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు

పెట్రోల్ పంప్‌ లోకి దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు

ఇబ్రహీంపట్నం, పెన్ పవర్, సెప్టెంబర్ 10:

పెట్రోల్ పంపులోకి అతివేగంగా దూసుకొచ్చిన ఓ ఆర్టీసీ బస్సు, పెట్రోల్ పోయించుకుంటున్న రెండు కార్లను, పెట్రోల్ పంప్‌ ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దిల్ సుఖ్ నగర్ నుండి చౌటుప్పల్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్, తన బస్సును అజాగ్రత్తగా వేగంగా నడిపి, బటసింగారంలోని భారత్ పెట్రోల్ పంప్‌లో పెట్రోల్ పోయించుకుంటున్న ‘షిఫ్ట్ డీజర్, బెలెనో కార్లను ఢీకొట్టాడు. దీంతో ఆ వాహనాలు దెబ్బతిన్నాయి. అలాగే, బస్సు పెట్రోల్ పంప్‌ను కూడా ఢీకొట్టడంతో ఆయిల్ డిస్‌ప్లే, పెట్రోల్ గన్, పిల్లర్, విద్యుత్ తీగలు దెబ్బతిన్నాయని తెలిపారు. పెట్రోల్ పంప్‌ లో మేనేజర్‌గా పనిచేస్తున్న బైరు సందీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దిల్ సుఖ్ నగర్ డిపోకు చెందిన అద్దె బస్సు డ్రైవర్ ప్రతాప్ రెడ్డిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular