Homeరాజకీయంపోలింగ్ కేంద్రాల జాబితా ప్రదర్శన

పోలింగ్ కేంద్రాల జాబితా ప్రదర్శన

గూడెంకొత్తవీధి, పెన్ పవర్, సెప్టెంబర్ 15:ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి గూడెంకొత్తవీధి మండలంలోని పోలింగ్ కేంద్రాల జాబితాను ఎంపీడీవో బిహెచ్‌వీ రమణబాబు మంగళవారం కార్యాలయం వద్ద ప్రదర్శించారు.జాబితాపై రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించేందుకు ఈనెల 16న సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో తెలిపారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే సమావేశంలో తెలియజేయవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో హెచ్‌వో ఇమ్మానియేల్, డిప్యూటీ ఎంపీడీవో జగదీష్, ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ కళ్యాణ్‌రావు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular