- పాడేరు, పెన్ పవర్, సెప్టెంబర్ 23:అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెడ్ అలర్ట్ కొనసాగుతున్న నేపథ్యంలో భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున సెప్టెంబర్ 24న జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ టి. నిశాంతి తెలిపారు.విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలకు ఈ సెలవు వర్తించదు. అక్కడి విద్యార్థుల భద్రత, పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ప్రజలు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి జిల్లా యంత్రాంగం సూచనలు పాటించాలని కలెక్టర్ కోరారు.

