Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుతుఫాన్ ప్రభావం.. అప్రమత్తతే రక్షణ:టిడిపి మండల ప్రధాన కార్యదర్శి పసుపులేటి నాగమణి

తుఫాన్ ప్రభావం.. అప్రమత్తతే రక్షణ:టిడిపి మండల ప్రధాన కార్యదర్శి పసుపులేటి నాగమణి

 

గూడెంకొత్తవీధి, పెన్ పవర్, సెప్టెంబర్ 24:తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున గూడెంకొత్తవీధి మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి, ఎంపీటీసీ పసుపులేటి నాగమణి సూచించారు.అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని, చెట్లు, విద్యుత్ స్తంభాలు, బలహీనమైన ఇళ్లకు దూరంగా ఉండాలని కోరారు. వాగులు, కాలువలు, నీటి ప్రవాహాలు దాటవద్దని, తెగిపడిన విద్యుత్ తీగలను తాకవద్దని హెచ్చరించారు. రైతులు పంటలు, పశువుల విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అధికారులు ఇచ్చే సూచనలు పాటించాలని నాగమణి విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular