Homeఆంధ్రప్రదేశ్బాపట్లప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్

చీరాల, సెప్టెంబర్ 25 :  ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం శుక్రవారం చీరాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య హాజరై ప్రజల నుంచి స్వయంగా సమస్యలపై వినతులు, అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 17 అర్జీలు అందగా, వాటిలో ఇంటి స్థలాలు, ఇంటి నిర్మాణాలకు సంబంధించి 8 అర్జీలు, ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) కోసం 2 అర్జీలు, ఇతర సమస్యలకు సంబంధించి 7 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వాటిని పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మాలకొండయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్దన్, చీరాల మండల అధ్యక్షులు గంజి పురుషోత్తం, మాజీ మున్సిపల్ చైర్మన్ మీంచాల సాంబశివరావు, మాజీ వైస్ చైర్మన్ పొత్తూరి సుబ్బయ్య, తేలబ్రోలు నాగేశ్వరరావు, జనసేన నాయకులు గూడూరు శివరాం ప్రసాద్, పి4 స్టాఫ్ అవినాష్‌తో పాటు కూటమి నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular