Homeఆంధ్రప్రదేశ్బాపట్లజెండా గణేష్ ఉత్సవాల్లో ఘనంగా అన్నసంతర్పణ

జెండా గణేష్ ఉత్సవాల్లో ఘనంగా అన్నసంతర్పణ

చీరాల, సెప్టెంబర్ 25 : జాండ్రపేటలో జెండా గణేష్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో నిర్వహించే జెండా గణేష్ ఉత్సవాలు ఈ ఏడాది కూడా వైభవంగా కొనసాగాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం జెండా గణేష్ స్వామివారిని చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన అన్నసంతర్పణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి భక్తులకు స్వయంగా అన్నసంతర్పణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణనాథుని దర్శించుకుని అన్నసంతర్పణ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గణపతి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహిస్తున్న జెండా గణేష్ కమిటీ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. గణపతి బప్పా మోరియా అంటూ భక్తులు నినాదాలు చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular