Homeఆంధ్రప్రదేశ్పోలవరంనూతన సబ్‌ కలెక్టర్‌కు రెవెన్యూ అధికారుల మర్యాదపూర్వక భేటీ

నూతన సబ్‌ కలెక్టర్‌కు రెవెన్యూ అధికారుల మర్యాదపూర్వక భేటీ

 

రంపచోడవరం, పెన్ పవర్, అక్టోబర్ 1:
రంపచోడవరం నూతన సబ్‌ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన డి. పృద్వి రాజ్‌కుమార్‌ను రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ కార్యదర్శి షేక్ పాయాజ్ భాష ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా నూతన సబ్‌ కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలియజేసి, రంపచోడవరం సబ్‌డివిజన్ పరిధిలో రెవెన్యూ పరిపాలనకు సంబంధించిన అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు రెవెన్యూ సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు అధికారుల సమన్వయంతో పనిచేస్తామని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రంపచోడవరం తహసీల్దార్ సిహెచ్. బాలాజీ, రెవెన్యూ అసోసియేషన్ హడాక్ కమిటీ సభ్యులు, డిప్యూటీ తహసీల్దార్లు వి. రవీంద్రబాబు, సునీత, మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు సిహెచ్. నిర్మల, టి. లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే సీనియర్ సంపాదకులు కె. వెంకటేశ్వర్లు, ఇందిరాబాయి, అలెగ్జాండర్, సిహెచ్. చంటి తదితరులు నూతన సబ్‌ కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular