అడ్డతీగల, పెన్ పవర్, సెప్టెంబర్ 29:అడ్డతీగల స్థానిక సీతపల్లి జంక్షన్ సమీపంలో గల కల్వర్టువద్ద మంగళవారం భారీ కొండచిలువ ప్రత్యక్షమైస్థానికులను భయాందోళనకు గురిచేసింది.రహదారిలొ ఉన్న కల్వర్టు వద్ద కొండచిలువకదలికలను గమనించిన స్థానికులు వెంటనేఅటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే అటవీశాఖ డీ ఆర్ ఓ యోగేంద్ర ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ఆయన రాజమండ్రికి చెందిన ప్రముఖ స్నేక్ క్యాచర్ ఈశ్వర్‌ను అప్రమత్తం చేశారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఈశ్వర్, చాకచక్యంగా వ్యవహరించి కొండచిలువను సురక్షితంగా బంధించారు. పట్టుబడిన కొండచిలువ సుమారు పది అడుగుల పొడవు ఉంటుందని డిఆర్ఓ తెలిపారు. ఈ కొండచిలువను సమీపంలో ఉన్న తపస్సు కొండ అటవీ ప్రాంతంలో విడిచి పెడుతున్నట్లు డిఆర్ఓ యోగేంద్ర తెలిపారు. స్థానికులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సకాలంలో స్పందించి పామును సురక్షితంగా తరలించిన అటవీశాఖ అధికారులు, స్నేక్ క్యాచర్‌ను స్థానికులు అభినందించారు.

