31వ వార్డులో సంక్షేమ పథకాల చెక్కుల పంపిణీ
లబ్ధిదారులకు సీఎం సహాయనిధి, కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ ద్వారా ఆర్థిక చేయూత
ఖమ్మం, పెన్ పవర్,అక్టోబర్ 4:
ఖమ్మం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 31వ వార్డుకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయనిధి( సి ఎం ఆర్ ఎఫ్) కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ పథకాల చెక్కులను పంపిణీ చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో, క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులతో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలుస్తున్నాయని తెలిపారు. సీఎం సహాయనిధి ద్వారా వైద్య, ఇతర అత్యవసర అవసరాలకు ఆర్థిక సహాయం అందుతుందని, కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ పథకాల ద్వారా అర్హులైన కుటుంబాలకు వివాహ సమయంలో ప్రభుత్వం చేయూతనిస్తోందన్నారు.
కార్యక్రమంలో ఏదులాపురం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బానోత్ కిషోర్ నాయక్, కౌన్సిలర్ కడవ నవీన్, వెంపటి సురేష్, ఏపూరి తరుణ్ తదితరులు పాల్గొన్నారు.

